News July 26, 2024
ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు: నడ్డా

దేశంలో ఏటా 2.5 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాలకు నడ్డా సమాధానమిచ్చారు. ‘క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరలో చికిత్స, మందులు అందిస్తున్నాం. మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. ఏటా 15.5 లక్షలకుపైగా ఈ కేసులు నమోదవుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
NIRDPRలో 98 ఉద్యోగాలు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 98 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. PG అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: career.nirdpr.in/
News January 27, 2026
ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట

AP Dy.CM పవన్ కుమారుడు అకీరానందన్పై <<18950891>>AI వీడియో<<>> చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన పేరుతో SMలో ఉన్న నకిలీ పేజెస్ తొలగించాలని కోరారు. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. AI లవ్ స్టోరీపై నిషేధం విధించింది. SM పేజెస్ తొలగించాలని, IP వివరాలు బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్ వంటి సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
News January 27, 2026
సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసం నుంచి ఆయన PSకు చేరుకున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్‌లో సంతోష్ ప్రమేయం ఉందనే ఆరోపణలపై అధికారులు విచారించే అవకాశముంది. అంతకుముందు కేటీఆర్, హరీశ్ రావును సిట్ విచారించిన సంగతి తెలిసిందే.


