News August 14, 2025

2028 నాటికి క్యాన్సర్ ఆస్పత్రి సిద్ధం: బాలకృష్ణ

image

AP: అమరావతి తుళ్లూరులో 21 ఎకరాల్లో ₹750 కోట్లతో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రిని 2028 నాటికి పూర్తి చేస్తామని MLA బాలకృష్ణ తెలిపారు. వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం 2 దశల్లో పూర్తిచేస్తామని, 2028లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు. తాము ఆస్పత్రిని లాభాపేక్ష కోసం నడపడంలేదని, తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్న తన తల్లి బసవతారకం కోరిక మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు.

Similar News

News January 18, 2026

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.

News January 18, 2026

ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

<>ఐఐటీ<<>> ఢిల్లీలో 29 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా అర్హత గలవారు అర్హులు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐఐటీ హాస్పిటల్, ఎస్టేట్& వర్క్స్, హాస్టల్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.12వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://home.iitd.ac.in/

News January 18, 2026

కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

image

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.