News March 23, 2025
త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2025
కునాల్ కమ్రా వివాదంపై స్పందించిన ఏక్నాథ్ శిండే

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలపై మహారాష్ట్ర DY.CM ఏక్నాథ్ శిండే స్పందించారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. వ్యంగ్యం మాకు అర్థం అవుతోంది. అయితే దానికీ ఓ హద్దు అంటూ ఉంటుంది’ అని శిండే అన్నారు. డిప్యూటీ సీఎంను ద్రోహి అనడంతో పాటు ఆయనపై వ్యంగ్యంగా కునాల్ పాట పాడటంతో వివాదం మొదలైంది. కాగా తను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని కునాల్ <<15877588>>కమ్రా చెప్పిన<<>> సంగతి తెలిసిందే.
News March 25, 2025
నేటి నుంచే ఆధార్ నమోదు శిబిరాలు

AP: రాష్ట్రంలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నేటి నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6సంవత్సరాలలోపు చిన్నారులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ సైతం ఈ కేంద్రాల వద్ద చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,709 ఉన్నట్లు గుర్తించారు.
News March 25, 2025
39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.