News July 28, 2024
15 నుంచి ఇంటి వద్దే క్యాన్సర్ స్క్రీనింగ్: కృష్ణబాబు

APలో క్యాన్సర్ రోగులకు రూ.680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రతి ఇంటికీ వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. క్యాన్సర్పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News November 25, 2025
ASF: ‘రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, MAL డా.హరీష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాల్లో కేవలం 20 మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని ఖండించారు. బెజ్జూర్లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. చట్టప్రకారం 23% రిజర్వేషన్ ఇవ్వలేదని, వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
News November 25, 2025
4th Day స్టంప్స్.. కష్టాల్లో టీమ్ ఇండియా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 549 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. సాయి సుదర్శన్, కుల్దీప్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి చివరి రోజు మరో 522 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <


