News April 9, 2025
ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.
Similar News
News April 17, 2025
కంచ భూములు ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదు: టీపీసీసీ చీఫ్

TG: కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో KTR ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. BRS హయాంలో HYD చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలా సార్లు BRSకు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.
News April 17, 2025
25న ‘గురుకుల’ పరీక్ష.. హాల్టికెట్లు విడుదల

AP: గురుకుల స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరగనుంది. గురుకుల విద్యాలయాల సంస్థ అభ్యర్థుల హాల్టికెట్లను ఇవాళ విడుదల చేసింది. <
News April 17, 2025
పాతబస్తీలో మెట్రో.. చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు: హైకోర్టు

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరంపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.