News May 12, 2024

ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు!

image

ప్రస్తుత రోజుల్లో ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఇది పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తోంది. కాగా ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు సైతం పెరుగుతోందనే భయంకర విషయాన్ని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. స్వీడన్‌లోని లండ్ వర్సిటీ పరిశోధకులు 3.32లక్షల క్యాన్సర్ కేసులను కొన్నేళ్ల పాటు అధ్యయనం చేశారు. వీటిలో 40% కేసులకు అధిక బరువుతో సంబంధం ఉందని తేల్చారు. 32 రకాల క్యాన్సర్లకు ఊబకాయం కారణమవుతోందని గుర్తించారు.

Similar News

News November 28, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.

వైకుంఠ ద్వార దర్శనం నేరుగా వెళ్లి చేసుకోవచ్చా?

image

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నేరుగా వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక టికెట్లు అవసరం లేదు. ఈ 7 రోజుల పాటు భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే DEC 30, 31, JAN 1 తేదీలలో టికెట్లు లేకుండా కొండపైకి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు.