News March 18, 2024

అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: CM జగన్

image

AP: వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ‘అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. “సిద్ధం” సభల తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.

Similar News

News October 31, 2024

స్థలం, రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?

image

TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.

News October 31, 2024

దీపావళి వేళ ఈ 5 ప్రదేశాల్లో దీపాలు పెట్టండి!

image

దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.

News October 31, 2024

ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలి: మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకున్నారు. లక్ష్మీగణేశుల ఆశీర్వాదంతో అందరూ సంపన్నమవ్వాలని ప్రార్థించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రజలకు విషెస్ చెబుతున్నారు. ఏపీ Dy CM పవన్ కళ్యాణ్ పాక్, బంగ్లా‌, అఫ్గాన్‌లోని హిందువులకూ శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.