News November 9, 2024
విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు

AP: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయి విశాఖ నడిబొడ్డుకు చేరింది. కింగ్జార్జ్ హాస్పిటల్(KGH) కొండ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్ వెనుక దుండగులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని పండించి విద్యార్థులకు అమ్ముతున్నారు. వైజాగ్ నేవీ కంట్రోల్లో ఉండే ఈ చోట గంజాయి సాగు కొనసాగుతుండటంతో పోలీసులు షాకయ్యారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్కి వేర్వేరు డివైజ్లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్వర్డ్లను మారుస్తూ ఉండాలి.


