News November 24, 2024
నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను: అభిషేక్ బచ్చన్
ఐశ్వర్యరాయ్‌తో విడాకులు వంటి నెగెటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయడంపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ‘వ్యక్తిగా మనం ఏంటన్నది స్థిరంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళ్లాలి. లేకపోతే వెనుకబడిపోతాం. కానీ మన మౌలిక విలువలు మారకూడదు. చెడు దాని స్వభావాన్ని మార్చుకోనప్పుడు, మంచి మాత్రం ఎందుకు మార్చుకోవాలి? నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2024
మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించి 24 గంటలు కూడా గడవక ముందే పార్టీ బలోపేతంపై BJP దృష్టి సారించింది. Membership Driveను ఉద్ధృతంగా నిర్వహించడానికి పార్టీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తగా 1.51 కోట్ల మందిని సభ్యులుగా చేర్చే డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. దీని కోసం కార్యకర్తలతో మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
News November 24, 2024
జగన్ వల్లే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం: యనమల
AP: అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయంలో మాజీ సీఎం జగన్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి వల్లే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతోందన్నారు. తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
News November 24, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల వివాహ వేడుకల స్ట్రీమింగ్కు భారీ డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో ఒక్కటి కానున్న నాగచైతన్య, శోభిత దూళిపాళ వివాహం స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.50 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. కాగా ఈ జోడీ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 4న వివాహం చేసుకోనుంది.