News March 23, 2024
ఇక బిడ్డను కనలేను: నటి

ఇకపై తాను బిడ్డను కనలేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. ‘నాకు కూతురు పుట్టిన తర్వాత ఏడేళ్లు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా. నాలుగేళ్ల క్రితం గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయా. ప్రస్తుతం నా వయసు 46 ఏళ్లు. ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నా కూతురికి చెల్లినో, తమ్ముడినో ఇవ్వలేకపోయాననే బాధ మెలిపెడుతోంది’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
సంగారెడ్డి: స్థానిక దంగల్.. రేపటి నుంచి నామినేషన్స్

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రేపటి నుంచి మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 613 సర్పంచ్, 5,370 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,68,270, మహిళలలు 3,75,843, ఇతరులు 8 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.
News November 26, 2025
చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.
News November 26, 2025
పంటలలో తెగుళ్ల ముప్పు తగ్గాలంటే..

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.


