News April 16, 2025
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదా?

వయసుతో సంబంధం లేకుండా ఇటీవల బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో బరువు తగ్గాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కొందరు బాధపడుతుంటారు. శరీరానికి అందిస్తున్న, ఖర్చు చేస్తున్న క్యాలరీలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాగే, ఎంత నీరు తాగుతున్నాం? సరిపడా నిద్ర పోతున్నామా? లేదా? ఒత్తిడికి గురవుతున్నామా? అనే విషయాలు చెక్ చేసుకోవాలి. ఇవి బరువుపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News April 16, 2025
ఈ వయసులో నాకిలాంటి మ్యాచులు అవసరం లేదు: పాంటింగ్

KKRతో మ్యాచ్‌లో తన గుండె వేగం పెరిగిందని పంజాబ్ కోచ్ పాంటింగ్ తెలిపారు. 50 ఏళ్ల వయసులో తనకు ఇలాంటి మ్యాచులు చూడాల్సిన అవసరం లేదని సరదాగా అన్నారు. చాహల్ అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. బ్యాటింగ్ దారుణంగా ఉన్నా.. వికెట్లు త్వరగా పడగొట్టి అద్భుతం చేశారన్నారు. ఎన్నో మ్యాచులకు కోచ్‌గా చేసినా ఈ విజయం మాత్రం తనకు బెస్ట్ అని పేర్కొన్నారు. మ్యాచ్‌పై నమ్మకంగా ఎలా ఉండాలనేదానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.
News April 16, 2025
AI టాలెంట్‌లో భారత్ టాప్: స్టాన్ఫోర్డ్ వర్సిటీ

గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్‌లో నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్‌ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.
News April 16, 2025
ఒక్కో ఖైదీపై ఏటా రూ.2.67 లక్షల ఖర్చు!

AP: రాష్ట్రంలో ఒక్కో ఖైదీపై ఏడాదికి రూ.2.67 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ‘ఇండియన్ జస్టిస్ రిపోర్ట్-2025‘ తెలిపింది. వివిధ జైళ్లలో ఉన్న 7,200 మంది ఖైదీల్లో ఒక్కొక్కరికి రోజుకు రూ.733 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది దేశంలోనే అత్యధిక ఖర్చని తెలిపింది. TGలో ఒక్కో ఖైదీపై ఏటా రూ.33,277 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. 6,500 మందిపై ఒక్కొక్కరికి రోజుకు రూ.91 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.