News October 23, 2024

ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను: కేటీఆర్

image

TG: కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆర్ 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా, సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన <<14254371>>వ్యాఖ్యలు<<>> చేశారని అన్నారు. ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

Similar News

News January 26, 2026

గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

image

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.

News January 26, 2026

CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

News January 26, 2026

ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

image

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.