News March 29, 2025

బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

image

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్‌లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్‌ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.

Similar News

News April 1, 2025

నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

image

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.

News April 1, 2025

ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

image

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం

News April 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!