News March 12, 2025
అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టి పడుకుంటే నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.
Similar News
News March 12, 2025
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
News March 12, 2025
కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ రూమర్స్‌పై క్రేజీ న్యూస్

బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో నటి శ్రీలీల డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో హీరో తల్లి మాలా తివారీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మంచి డాక్టర్‌ను కోడలిగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసిన్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. కార్తిక్ ఆర్యన్‌తో ఓ మూవీలో నటిస్తున్నారు
News March 12, 2025
చీఫ్ సైంటిస్టుపై వేటువేసిన NASA

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చీఫ్ సైంటిస్టు కేథరిన్ కాల్విన్ సహా మరికొందరిపై NASA వేటువేసింది. వాతావరణ మార్పుల పరిశోధన విభాగంలో ఆమె కీలకంగా పనిచేస్తున్నారు. పారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంతో ఈ కోతలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 23 మందిని తొలగించగా మున్ముందు మరింత మందిపై వేటు పడుతుందని NASA పేర్కొంది. MAR 10న కొందరు ఉద్యోగులకు దీనిపై నోటిఫికేషన్ రావడం గమనార్హం.