News March 18, 2024
నా ప్రియుడిని విమర్శిస్తే తట్టుకోలేను: ఇలియానా

తన ప్రియుడు మైఖేల్ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనని హీరోయిన్ ఇలియానా అన్నారు. ‘నా గురించి ఎవరేం మాట్లాడినా తట్టుకున్నా. నెటిజన్లు నన్న ఘోరంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నా కాబట్టి భరించా. కానీ నా భాగస్వామి, కుటుంబంపై విమర్శలు వస్తే భరించలేను. నా కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ రాకతో మా జీవితం మారిపోయింది. గతేడాది ఎంతో సంతోషంగా గడిచింది’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News October 25, 2025
HEADLINES

* కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
* ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి
* మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం: మోదీ
* దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం AP: CBN
* బంగాళాఖాతంలో ఈనెల 27న ఏర్పడనున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
* భారీగా తగ్గిన వెండి ధరలు
News October 25, 2025
మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులు విడుదల

TG: రాష్ట్రంలో మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులకు ఆమోదం తెలిపింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు, కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.30 కోట్ల చొప్పున రిలీజ్ చేశారు.
News October 25, 2025
రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

TG: గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల(రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్మెంట్ పనులను వీరి పరిధిలోకి తెచ్చింది. అటవీ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


