News August 7, 2024

₹10 కాయిన్ తీసుకోవట్లేదా? శిక్ష తప్పదు: RBI

image

పది రూపాయల నాణేలు చెల్లవన్నది అపోహేనని RBI స్పష్టం చేసింది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న నాణెమైనా చెల్లుతుందని, వాటిని తీసుకునేందుకు ఎవరూ నిరాకరించవద్దని తెలిపింది. నిరాకరిస్తే చట్టప్రకారం శిక్షార్హులని హెచ్చరిస్తోంది. రూ.10 కాయిన్స్ బయట వ్యాపారులెవరూ తీసుకోకపోవడంతో బ్యాంకుల్లోనే భారీ సంఖ్యలో ఉండిపోతున్నాయని పేర్కొంది. నాణేలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతోంది.

Similar News

News October 21, 2025

‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

image

CRZ రిస్ట్రిక్షన్స్‌ను 500 నుంచి 200 మీటర్లకు కుదించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును తిరస్కరించాలని పర్యావరణవేత్తలు PMకి విన్నవించారు. ‘సముద్ర మట్టం పెరుగుదల వల్ల 2050కు దేశంలోని 113 సిటీలు మునిగిపోతాయని INDIA డవలప్మెంటు రిపోర్టు చెబుతోంది. ప్రస్తుత రూలే కాలం చెల్లగా, ఇంకా కుదించడం మరింత ప్రమాదం’ అని పేర్కొన్నారు. సీ లెవెల్ 91MM పెరిగిందని, ముంపు వంటి ఉపద్రవాలపై నాసా హెచ్చరించిందని గుర్తుచేశారు.

News October 21, 2025

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) 3కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)తో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్‌టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్‌సైట్: https://www.becil.com/

News October 21, 2025

లక్ష్మీనాయుడు హత్యపై ప్రత్యేక ట్రిబ్యునల్‌తో విచారణ

image

AP: కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రత్యేక ట్రిబ్యునల్‌తో దర్యాప్తు వేగవంతం చేయాలని CM CBN ఆదేశించారు. ‘మృతుని భార్యకు, పిల్లలకు రెండేసి ఎకరాలు, ₹5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గాయపడ్డ పవన్‌కు 4 ఎకరాలు, ₹5 లక్షలు, భార్గవ్‌కు ₹3లక్షలు, ఆసుపత్రి ఖర్చు చెల్లించాలి’ అని సూచించారు. విచారణ వేగంగా జరిగేలా FAST TRACK కోర్టుకు అప్పగించాలన్నారు.