News October 28, 2024
మహారాష్ట్రలో ఒంటరిగా గెలవలేం.. కానీ: ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఒంటరిగా గెలవలేదని ఆ పార్టీ నేత, Dy.cm దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయితే అధిక సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్నారు. మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ NCPలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సీట్లు ఆశించిన కొందరికి అవకాశం దక్కకపోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


