News October 11, 2024

ఆరోగ్యానికి సీతాఫలం

image

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.

Similar News

News October 11, 2024

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ డైరెక్టర్

image

సగటు తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు వి.వి.వినాయక్ పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్లతో ఆయన సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.

News October 11, 2024

IPL వేలంలో రోహిత్? హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. అతడిని దక్కించుకునేందుకు ఏ జట్టు అత్యధికంగా బిడ్ వేస్తుందో చూడాలని ఉందన్నారు. రోహిత్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆయన భారీ ధర పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.

News October 11, 2024

నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. దీనిలో భాగంగా ఇవాళ 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డిలోని షాద్‌నగర్ వద్ద సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం ఈ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.