News July 18, 2024

ఒకే మోడల్‌లో అన్న క్యాంటీన్లు: నారాయణ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. క్యాంటీన్లన్నీ ఒకే మోడల్‌లో ఉంటాయని, రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తామన్నారు. చెత్తపన్ను అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మురికి కాల్వల్లో సిల్ట్ తీసేందుకు 106 మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు రిలీజ్ చేశామన్నారు.

Similar News

News November 16, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్‌ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్

News November 16, 2025

పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

image

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్‌ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.

News November 16, 2025

STRANGE: ఈ ఊరిలో 450 మంది ట్విన్స్

image

ఒక ఊరిలో పది మంది కవలలు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాంటిది 2వేల మంది జనాభా ఉన్న కేరళలోని ‘కొడిన్హి’లో ఏకంగా 450 జతల కవలలు ఉంటే ఇంకెలా ఉంటుంది. అక్కడ కవల పిల్లలు ఎక్కువగా పుట్టడం అంతుచిక్కని విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, జన్యు శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్దిష్టమైన కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే వలస వచ్చిన కుటుంబాలకూ కవలలు జన్మించడం విచిత్రం.