News January 19, 2025
TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు!
TG: సింగపూర్లో పర్యటిస్తున్న CM రేవంత్ బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టినట్లు CMO వెల్లడించింది. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ₹450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాపిటా ల్యాండ్ సంస్థ ముందుకొచ్చిందని పేర్కొంది. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. నిన్న STT గ్లోబల్ డేటా సెంటర్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆర్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది.
Similar News
News January 19, 2025
ఆర్థిక పరిస్థితి దుర్భరం.. అయినా పథకాల అమలు: మంత్రి జూపల్లి
TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
News January 19, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ యంగ్ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు ధరల్ సురేలియాతో కలిసి ఏడడుగులు వేశారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2014లో ఇండియాస్ రా స్టార్ ఫస్ట్ సీజన్ ద్వారా ఇతను గుర్తింపు పొందారు. హిందీ, గుజరాతీ సినిమాల్లో వందకు పైగా పాటలు పాడారు. తెలుగులో నాని ‘జెర్సీ’ సినిమాలో ‘నీడ పడదని మంటననగలరా’ పాటను ఆలపించారు.
News January 19, 2025
సైఫ్ అలీఖాన్ హెల్త్ అప్డేట్
కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని ఆయన సోదరి సోహా అలీఖాన్ తెలిపారు. ‘అన్నయ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సైఫ్ కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఆమె మీడియాతో అన్నారు. ఈనెల 16న అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనను కత్తితో పొడిచాడు. మూడు రోజుల అనంతరం ఇవాళ నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.