News April 15, 2025
రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో ప్రస్తుతం 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ నెలాఖరుకు 15 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.
Similar News
News April 16, 2025
ఐఫోన్ అమ్మకాల్లో రికార్డు

భారత్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 30 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. తొలి 3 నెలల్లో ఈ స్థాయిలో సేల్ జరగడం ఇదే తొలి సారి. గత ఏడాది ఇదే సమయంలో 22.1 లక్షల ఫోన్లు అమ్ముడవగా, ఈసారి 36.1% వృద్ధి నమోదైంది. దీంతో మార్కెట్ షేర్లో యాపిల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియాలో టాప్-2లో ఉండే వివో (2.7%), శాంసంగ్ (19.5%) అమ్మకాల్లో ఈసారి తగ్గుదల కనిపించగా, ఒప్పో (14.3%), రియల్ మీ (5.3%) సేల్స్ పెరిగాయి.
News April 16, 2025
ఎంపీల అటెండెన్స్.. టాప్ ఎవరంటే?

TG: 24 జూన్ 2024 – 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. BJP MP ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగి 88 శాతం హాజరయ్యారు. MIM MP అసదుద్దీన్ 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ MP రఘువీర్ అతి తక్కువగా 8 ప్రశ్నలే అడిగారు.
News April 16, 2025
ఇండియన్ రైల్వేస్కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.