News December 1, 2024
కెప్టెన్ రోహిత్ ప్రయోగం ఫెయిల్!

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్‌శర్మ <<14760217>>ప్రయోగం<<>> ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రెగ్యులర్ ఓపెనర్ అయిన రోహిత్ ఈ మ్యాచ్‌లో నం.4లో క్రీజులోకి వచ్చారు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 3పరుగులకే అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టుకు దూరమైన రోహిత్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను సరిగా వినియోగించుకోలేకపోయారు. దీంతో హిట్‌మ్యాన్ ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News March 14, 2025
జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం

జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పరిమితంగా అమలు చేసేందుకు అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం సుప్రీంకోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ ఆర్డర్‌ను అడ్డుకొనే అధికారం జిల్లా కోర్టులు, ఇండివిడ్యువల్ జడ్జిలకు లేదని తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్నవారిని మినహాయించి ట్రంప్ ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. USలో అక్రమ నివాసితులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ట్రంప్ ఆదేశించడం తెలిసిందే.
News March 14, 2025
నాని కేరాఫ్ నయా టాలెంట్

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.
News March 14, 2025
మీరు గొప్పవారు సర్..

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ టీచర్ బాల్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైనా పాఠాలు చెప్పడం మానట్లేదు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రోజూ 15 KM సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఒక్క రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేస్తున్నారు.