News July 26, 2024

ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు

image

రేపటి నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టీ20 ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు తొలి టీ20, ఎల్లుండి రెండో మ్యాచ్, 30న చివరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ పల్లెకెలె వేదికగా జరగనున్నాయి.

Similar News

News October 14, 2025

డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.

News October 14, 2025

తాజా రౌండప్

image

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం

News October 14, 2025

విజయనగరం జిల్లాలో మెగా జాబ్ మేళా

image

విజయనగరం జిల్లాలోని గరివిడి SDS డిగ్రీ కాలేజీలో రేపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకోనున్నాయి. 10 MNC కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి.