News November 3, 2024
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో అదుపుతప్పి చెరువులో పడటంతో మైనర్ బాలిక సహా ఎనిమిది మంది మరణించారు. టర్నింగ్ దగ్గర స్కిడ్ అయి చెరువులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. మృతులు లరిమా గ్రామానికి చెందినవారని చెప్పారు. సూరజ్‌పూర్ వెళ్తుండగా దబ్రి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News January 18, 2026
డెయిరీఫామ్ కోసం పశువులను కొంటున్నారా?

డెయిరీఫామ్ నిర్వహణలో భాగంగా ఆవులు, గేదెలను కొనుగోలు చేసి పాడి రైతులు, పెంపకందారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంటారు. ఇలా తరలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. లేకుంటే వాటి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలను కూడా కొనుగోలుదారులు కలిగి ఉండాలి. ఆ పత్రాల వివరాలు, జీవాల తరలింపులో జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 18, 2026
అంగన్వాడీల్లో అల్పాహారం.. వచ్చే నెలలో ప్రారంభం

TG: అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్స్‌ను పిల్లలకు అందించనుంది. తొలుత హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిధిలో ఉన్న 970 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా 35,781 కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.
News January 18, 2026
NSUTలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపవచ్చు. పోస్టును బట్టి BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు. వెబ్సైట్: https://nsut.ac.in


