News January 2, 2025
కార్ రేస్ కేసు విచారణ.. నేటి నుంచే షురూ

TG: ఫార్ములా-ఈ రేస్ కారు కేసులో ఈడీ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, రేపు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ను ఇంటరాగేషన్ చేయనుంది. వీరిద్దరి వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈనెల 7న ఈడీ ప్రశ్నించనుంది. అయితే విచారణకు వెళ్లేది, లేనిది తమ లాయర్లు నిర్ణయిస్తారని నిన్న ఆయన అన్నారు.
Similar News
News November 28, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

పార్వతీపురం కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చు అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆదేశించారు.
News November 28, 2025
SU MBA, MCA పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న MBA, MCA విభాగంలో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 5 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో DEC 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.