News June 8, 2024
నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్‌సన్

నార్వే చెస్ టోర్నీ-2024 విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచారు. ఫైనల్ రౌండ్‌లో ఫాబియానో కరువానాపై విజయం సాధించారు. కార్ల్‌సన్ నార్వే చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి. కాగా ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 9వ రౌండ్‌లో ఫాబియానో చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను గెలిచారు. ఈ టోర్నీలో కార్ల్‌సన్(17.5) తొలి స్థానం సంపాదించగా, నకమురా(15.5), ప్రజ్ఞానంద(14.5) 2, 3 స్థానాల్లో నిలిచారు.
Similar News
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.
News September 11, 2025
రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో క్యాంపస్ నియామకాలు!

క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ల నియామకం కోసం కాలేజీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను తగ్గించేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తగా 20,000 మందిని తీసుకునే ఛాన్సుంది.