News September 22, 2025
KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్‌కు చెందిన చందర్‌పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.
Similar News
News September 22, 2025
ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News September 22, 2025
రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.
News September 22, 2025
మీరూ చూసేయండి: కనక దుర్గమ్మ ఆభరణాలు

తొలి రోజు: బాలాత్రిపుర సుందరీదేవి(అభయ హస్తాలు, బంగారు పూల జడ, కంఠాభరణాలు)
రెండో రోజు: గాయత్రీ దేవి(స్వర్ణ పంచముఖాలు, అభయ హస్తాలు, పచ్చల హారం, శంఖు చక్రాలు, కిరీటం, కంఠాభరణం)
మూడో రోజు: అన్నపూర్ణాదేవి(త్రిశూలం, అభయ హస్తాలు, స్వర్ణపాత్ర)
నాలుగో రోజు: కాత్యాయనీ దేవి( స్వర్ణ కిరీటం, పచ్చల హారం, అభయ హస్తాలు)
ఐదో రోజు: మహాలక్ష్మీదేవి(కర్ణాభరణాలు, శంఖు, చక్రాలు, గద, వడ్డాణం, అభయ హస్తాలు, ధనరాశులు)