News March 20, 2025

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News November 25, 2025

గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

image

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్‌ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్‌ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.

News November 25, 2025

వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

image

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.