News September 29, 2024

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కేసు

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.

Similar News

News September 29, 2024

అమెరికా పెద్ద తప్పు చేసింది: నార్త్ కొరియా

image

ఉక్రెయిన్‌కు 8 బిలియన్ డాలర్ల సైనిక సహాయం ఇవ్వాలని నిర్ణ‌యించి అమెరికా పెద్ద త‌ప్పు చేసింద‌ని నార్త్ కొరియా అభిప్రాయపడింది. ఇది నిప్పుతో చెల‌గాటం లాంటిద‌ని పేర్కొంది. ఉక్రెయిన్ సంఘర్షణను వాషింగ్టన్‌ తీవ్రతరం చేస్తోందని, ఐరోపా మొత్తాన్ని అణుయుద్ధం అంచుకు నడిపిస్తోందని దేశాధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోద‌రి కిమ్ యో జోంగ్ అన్నారు. ర‌ష్యా హెచ్చ‌రిక‌ల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

News September 29, 2024

ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం

image

AP: విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News September 29, 2024

ఆ మాజీ మంత్రి తిరిగి క్యాబినెట్‌లోకి

image

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ముఖ్య‌మంత్రి స్టాలిన్ తిరిగి త‌న క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై 15 నెల‌ల‌పాటు జైలులో ఉన్న సెంథిల్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఇక ఉద‌య‌నిధి స్టాలిన్‌కు DyCMగా ప్ర‌మోష‌న్ ద‌క్కిన విషయం తెలిసిందే. అలాగే క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరో ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులు ఆదివారం మ‌ధ్నాహ్నం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.