News December 20, 2024
KTRపై కేసు.. తర్వాత ఏం జరుగుతుంది?

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి KTRను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ACB కేసు నమోదు చేసింది. విచారణ కోసం ACB టీమ్‌నూ సిద్ధం చేసింది. దీంతో ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. నిందితులకు తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టు చేస్తారని కొన్ని మీడియా సంస్థలు, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తారని మరికొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి.
Similar News
News December 13, 2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.


