News March 30, 2025

రాప్తాడు, కళ్యాణదుర్గం YCP ఇన్‌ఛార్జులపై కేసు

image

AP: రాప్తాడు, కళ్యాణదుర్గం వైసీపీ ఇన్‌ఛార్జులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్‌లపై పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 27న పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీరిద్దరూ పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని, దౌర్జన్యం చేశారని చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.

Similar News

News April 2, 2025

HCU భూములపై విచారణ రేపటికి వాయిదా

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు చెట్లు కొట్టేయొద్దని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా HCU భూముల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వారం నుంచి జేసీబీలు, పొక్లెయిన్లతో అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించి చదును చేయిస్తోంది.

News April 2, 2025

RRకు గుడ్ న్యూస్.. సంజూకి లైన్ క్లియర్!

image

సంజూ శాంసన్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించేందుకు ఆయనకు BCCI ఆమోదం తెలిపింది. IPLకు ముందు కుడి చూపుడు వేలు ఫ్రాక్చర్ కావడంతో సంజూ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నారు. తాజాగా ఫిట్‌నెస్ టెస్టుల్ని క్లియర్ చేయడంతో బెంగళూరులోని NCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News April 2, 2025

ముంబై ఫ్రాంచైజీ ఓనర్‌గా సచిన్ కూతురు

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా క్రికెట్లోకి అడుగుపెట్టారు. కానీ ప్లేయర్‌గా కాదు ఓనర్‌గా. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్‌ లీగ్‌(GEPL)లో ముంబై ఫ్రాంచైజీ యజమానురాలిగా సారా వ్యవహరించనున్నారు. జెట్ సింథెసిస్ నిర్వహించే GEPL.. ఒక ఆన్‌లైన్ గేమింగ్. దీనికి 300మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. Jio సినిమా, స్పోర్ట్స్18లో 2.4 మి. మినిట్స్‌కిపైగా స్ట్రీమింగ్ కంటెంట్ అందుబాటులో ఉంది.

error: Content is protected !!