News December 31, 2024
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
Similar News
News October 23, 2025
నేడు..

* ఇవాళ <<18073538>>తెలంగాణ<<>> మంత్రివర్గ సమావేశం.. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం
* గోరక్షక్ దళ్ సభ్యుడిపై దాడికి నిరసనగా డీజీపీ ఆఫీసు ఎదుట బీజేపీ నేతల నిరసన
* వైసీపీ చీఫ్ జగన్ మీడియా <<18075756>>సమావేశం<<>>
* WWCలో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమ్ఇండియా
* ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్, ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
News October 23, 2025
బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్‌కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://nests.tribal.gov.in