News March 16, 2025
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

TG: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ <<15767906>>హర్ష సాయిపై<<>> సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
Similar News
News April 3, 2026
₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్!

అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఇంకా US స్పందించలేదు. మార్చి 19న కూడా F-35 జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ చెప్పింది. ఈ విమానం విలువ ₹931 కోట్ల పైనే అని సమాచారం. కువైట్‌లో చమురు శుద్ధి కర్మాగారం, సౌదీలోని US రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది.
News April 3, 2026
అప్పుడు ముత్తాత.. ఇప్పుడు మనుమడు

నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాత్రలో మెప్పించడం రణ్‌బీర్ కుటుంబానికి కొత్తేమీ కాదు. లెజెండరీ నటుడు, రణ్‌బీర్ ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ 92ఏళ్ల క్రితం బెంగాలీ సినిమా ‘సీత’లో శ్రీరాముడి పాత్ర పోషించారు. ఇది ఇండియన్ సినిమాలో ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు శతాబ్దం తర్వాత రణ్‌బీర్ మళ్లీ ఆ పవిత్ర పాత్రను పోషిస్తుండటం విశేషం.
News April 3, 2026
E-PPO: రిటైర్డ్ ఉద్యోగులకోసం కొత్త విధానం

TG: రిటైర్డ్ ఉద్యోగుల కోసం GOVT కొత్త పెన్షన్ చెల్లింపు విధానాన్ని తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లోనే అన్ని ప్రక్రియలు ముగిసేలా ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్(E-PPO) సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది. పత్రాల సమర్పణకు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా ఆన్‌లైన్లో సబ్మిట్ చేసేలా పెన్షన్‌దారులకు 12 అంకెల IDని ఇవ్వనుంది. అక్రమాల నిరోధానికి, మృతుల పెన్షన్లు కొనసాగకుండా నిలిపివేతకు వీలుంటుందని భావిస్తోంది.


