News August 16, 2024

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు జోగి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయనను విచారిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, విచారణకు సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

Similar News

News January 21, 2025

కింగ్ రిటర్న్ అయ్యారు: ఎలన్ మస్క్

image

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన వేళ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ట్రంప్ అకౌంట్‌ను గతంలో ట్విటర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆనాటి, ప్రస్తుతం ఆయన పేరు పక్కన యాడ్ అయిన అధ్యక్షుడు అనే అక్షరాలు కనిపించేలా ‘కింగ్ రిటర్న్ అయ్యారు’ అంటూ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలకంగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

News January 21, 2025

నెలాఖరున ‘RC16’‌లో జాయిన్ కానున్న చెర్రీ

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ ‘RC16’‌ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 25% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘RC16’ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

News January 21, 2025

డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నాం: గంగూలీ

image

ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు కాగానే డిఫరెంట్ రోహిత్‌ను చూడబోతున్నామని చెప్పారు. హిట్‌మ్యాన్ వైట్‌బాట్ క్రికెట్ అద్భుతంగా ఆడతారని ప్రశంసించారు. CT-2025 ఫిబ్రవరి 19న మొదలు కానుండగా భారత్ తన తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్ జట్టుతో ఆడనుంది.