News May 20, 2024

సీఎం జగన్‌పై దాడి కేసు.. విచారణ వచ్చే నెల 23కు వాయిదా

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న జగన్‌పై గత నెలలో నిందితుడు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం నుదుటికి కుట్లు పడ్డాయి.

Similar News

News December 4, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>THDC<<>>)లో 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc(ఇంజినీరింగ్), బీటెక్, BE, MBBS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: thdc.co.in

News December 4, 2025

తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

image

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 4, 2025

సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.