News September 4, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

AP: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో YCP నేతలకు ముందస్తు బెయిల్‌‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. TDP ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి, అవినాశ్, తలశిల రఘురాం, నందిగామ సురేశ్, జోగి రమేశ్, CBN నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితులుగా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు నుంచి మినహాయించాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరగా మధ్యాహ్నం నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Similar News

News December 17, 2025

రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

image

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.

News December 17, 2025

చేతిలో డబ్బు నిలవాలంటే..

image

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.

News December 17, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>CSIR<<>>-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in