News July 11, 2024
TDP ఆఫీసుపై దాడి కేసు.. సజ్జల ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైసీపీ సీనియర్ నేతలు సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ బెయిల్ పిటిషన్లు వేశారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు.
Similar News
News December 9, 2025
ఫ్యూచర్ సిటీలో ‘రేసింగ్ & మోటోక్రాస్’ కేంద్రం

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ-ప్రామాణిక ‘రేసింగ్ & మోటోక్రాస్’ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ‘సూపర్‌క్రాస్ ఇండియా’ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో డర్ట్ ట్రాక్‌లు, రైడర్ శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ ఏర్పాటుచేయనుంది. ఇందులో ప్రపంచ రేసింగ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తారు. భూమి, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.
News December 9, 2025
ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
News December 9, 2025
టీవీని రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తున్నారా?

రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసినప్పటికీ ప్లగ్‌ని అలాగే ఉంచడం వల్ల నిరంతరంగా విద్యుత్తు వినియోగమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట TV ప్లగ్‌ను తీసేస్తే విద్యుత్ వృథాను తగ్గించవచ్చు. అలాగే ఇది షార్ట్ సర్క్యూట్ల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. టీవీతో పాటు, సెట్-టాప్ బాక్స్‌లు, ఛార్జర్ల ప్లగ్‌లను కూడా అవసరం లేనప్పుడు తీసివేస్తే కరెంటు ఆదా అయి, బిల్లు తక్కువగా వస్తుందంటున్నారు. share it


