News July 11, 2024
TDP ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ఊరట

AP: హైకోర్టులో YCP నేతలకు ఊరట దక్కింది. 2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఈ నెల 16 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్పై సైతం చర్యలు తీసుకోవద్దంది.
Similar News
News November 22, 2025
IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iiitkalyani.ac.in
News November 22, 2025
హనుమాన్ చాలీసా భావం – 17

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయె సబ జగ జానా || హనుమంతుడి ఉద్దేశాన్ని పాటించిన విభీషణుడు లంకకు రాజయ్యాడు. ఆయన విజయానికి ఆంజనేయుడి సలహా, ఆశీర్వాదాలు ఎంతో తోడ్పడ్డాయి. ఇలా విభీషనుడిని ఆదుకున్నట్లే హనుమాన్ మనల్ని కూడా ఆదుకుంటాడు. ఎంతో విశ్వాసంతో ఆయన నామాన్ని, మంత్రాన్ని జపిస్తే.. వారిని సత్య మార్గంలో నడిపిస్తాడు. రాముడిని కొలిచేవారికి హనుమంతుని అండదండలు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం.<<-se>>#HANUMANCHALISA<<>>
News November 22, 2025
T2OIWC-2026.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే మెన్స్ T2OIWCలో 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఒక గ్రూపులో ఇండియా, పాక్, USA, నమీబియా, నెదర్లాండ్స్, రెండో గ్రూపులో ఆసీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉంటాయని క్రిక్బజ్ వెల్లడించింది. మూడో గ్రూపులో ఇంగ్లండ్, విండీస్, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూపులో సౌతాఫ్రికా, కివీస్, అఫ్గాన్, UAE, కెనడా ఉంటాయని తెలిపింది.


