News October 14, 2024
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు సరెండర్

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, MLC లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. YCP విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ఇవాళ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు.
Similar News
News October 19, 2025
MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 19, 2025
ఆసీస్పై పైచేయి సాధిస్తామా?

నేడు భారత్, AUS మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 152సార్లు తలపడగా ఆసీస్ 84 మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యం చెలాయిస్తోంది. అటు ఆ దేశంలోనూ మన రికార్డ్ పేలవంగానే ఉంది. 54 వన్డేల్లో కేవలం 14సార్లే మనం గెలిచాం. ఈ క్రమంలో తాజా సిరీస్ను కైవసం చేసుకొని పైచేయి సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇవాళ తొలి వన్డే జరిగే పెర్త్లో పరుగులు రాబట్టడం కష్టమే అని క్రీడా విశ్లేషకుల అంచనా.
News October 19, 2025
దీపావళి: లక్ష్మీ పూజలు ఏ రోజున జరపాలి?

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియలు సూర్యాస్తమయానికి ఆ రోజునే ఉండటంతో.. అదే రోజు దీపావళిని జరుపుకోవడం శ్రేయస్కరం అని అంటున్నారు. ‘లక్ష్మీదేవి పూజ కోసం శుభ ముహూర్తం అక్టోబర్ 20న రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. భక్తులు ఈ ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేసి, దీపాలు వెలిగించి, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.