News February 25, 2025
నటి మాధవీలతపై కేసు నమోదు

AP: సినీనటి మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది. DEC 31న తాడిపత్రి JC పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని SC కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ CI సాయిప్రసాద్ తెలిపారు. మాధవీలత వ్యాఖ్యలపై JC ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించి ఆపై ఆమెకు సారీ చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2025
టాటా గ్రూప్ నుంచి IPOకు మరో కంపెనీ

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. IPO ప్రణాళికలను ఆమోదించినట్టు టాటా క్యాపిటల్ మంగళవారం తెలిపింది. ఫ్రెష్ ఇష్యూ కింద 23 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు OFS కింద స్టాక్స్ ఇవ్వనుంది. రూ.1504 కోట్ల విలువైన షేర్లను రైట్స్ ఇష్యూ కింద కేటాయిస్తోంది. నోటిఫై చేసిన మూడేళ్లలో అప్పర్ లేయర్ NBFCలు IPOకు రావాలన్న RBI నిబంధనల మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
News February 25, 2025
మార్చి 1న కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్‌లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.