News March 25, 2025

కాకాణిపై కేసు నమోదు

image

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసినా క్వార్ట్జ్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదు చేశారు. గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చేర్చారు. ఆయనపై 120బి, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Similar News

News March 27, 2025

నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ప్యానళ్ల పనులను, ఎగువ కాఫర్ డ్యామ్‌ను ఆనుకుని సీపేజీ నివారణకు సాగుతున్న బట్రెస్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

News March 27, 2025

IPL: నేడు SRHతో LSG ఢీ

image

HYD రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇవాళ రా.7.30కి SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో భీకర ఫామ్‌లో ఉన్న SRH హిట్టర్లు మరోసారి రికార్డు బ్రేకింగ్ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. LSG బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా కనిపిస్తుండడంతో గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం తప్పదేమో. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 4 మ్యాచుల్లో తలపడగా LSG 3, SRH 1 గెలిచింది. నేడు SRH 300 కొడుతుందా? COMMENT

News March 27, 2025

నేటితో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి

image

TG: రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్ ఉల్ హసన్ అఫెంఢీ, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మండలిలో వీరికి నేడు సన్మానం కార్యక్రమం జరగనుంది.

error: Content is protected !!