News July 15, 2024
కన్నడ స్టార్ హీరోపై కేసు నమోదు

కన్నడ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రక్షిత్శెట్టిపై కాపీరైట్ కేసు నమోదైంది. ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమా కోసం తమ 2 పాటలను రక్షిత్ కాపీ కొట్టారంటూ MRT మ్యూజిక్ కంపెనీ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై స్పందించాలని రక్షిత్కు నోటీసులు పంపించారు. రక్షిత్ ఇటీవల ‘777 చార్లీ’ మూవీతో పాపులర్ అయ్యారు. హీరోయిన్ రష్మిక మందన్నతో 2017 నిశ్చితార్థం కాగా 2018లో పెళ్లిని రద్దు చేసుకున్నారు.
Similar News
News January 21, 2026
HYDలో ఫిబ్రవరి 12 తర్వాత కొత్త సీన్?

నగరంలో పాలనా ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైంది. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడనప్పటికీ FEB 12 తర్వాత ముగ్గురు అధికారులు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. CYB కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఎన్నికలు ముగిసే వరకు GHMC కమిషనర్గా RV.కర్ణన్ చక్రం తిప్పనున్నారు. వార్డుల విభజన తర్వాత సిటీ రూపురేఖలు మారతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
News January 21, 2026
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.
News January 21, 2026
గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.


