News October 15, 2024

KTRపై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 12, 2026

జాతీయ వేదికపై తుని యువతి సత్తా!

image

తుని మండలం హెచ్.కొత్తూరుకు చెందిన ములికి సత్యవతి వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కేరళలో జరిగిన ‘అస్మిత ఖేలో ఇండియా’ సౌత్ జోన్ పోటీల్లో రజత పతకం సాధించిన ఆమె, జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి, సత్యవతి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

News January 12, 2026

జంతికలు కరకరలాడుతూ రావాలంటే?

image

జంతికలు కరకరలాడాలంటే కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల సెనగపిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో కలపాలి. పిండిలో వాము, వెన్న వేయాలి. గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. 15 నిమిషాల తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి.

News January 12, 2026

శివారాధనలో ‘3’ అంకె విశిష్టత

image

శివారాధనలో 3 అంకెకు విశిష్ట స్థానం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు చిహ్నం. ఆయనకెంతో ఇష్టమైన బిల్వదళంలోని 3 పత్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మూడో నేత్రం జ్ఞానం, అంతర్దృష్టిని సూచిస్తుంది. త్రిపుండ్రాలు భౌతిక, ఆధ్యాత్మిక, అతీంద్రియ శక్తులకు సంకేతాలు. శివలింగాన్ని దర్శిస్తే ముల్లోకాలు దర్శించినట్లే! శివానుగ్రహం కోసం మారేడు దళాల నోము ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.