News November 13, 2024

యశ్ ‘టాక్సిక్’ మూవీపై కేసు నమోదు

image

కోలీవుడ్ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీపై అటవీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్ర నిర్మాతలతోపాటు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పై కూడా FIR నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ‘టాక్సిక్’ షూటింగ్ కోసం మూవీ టీమ్ వందల ఎకరాల అటవీ భూముల్లో చెట్లను కొట్టివేసిందనే ఆరోపణలతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు చేసింది.

Similar News

News December 26, 2024

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆయన ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఆయన అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. కాగా హార్దిక్ వన్డేలు ఆడక ఏడాది దాటిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో గాయపడినప్పటి నుంచి ఆయన ఈ ఫార్మాట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో హార్దిక్ వన్డేలపై దృష్టి సారించారు.

News December 26, 2024

ప్రముఖ RJ, ఇన్‌స్టా ఫేమ్ ఆత్మహత్య

image

రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్‌లో సెక్టర్-47లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కు ఇన్‌స్టాలో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమెను ‘జమ్మూ కి ధడ్‌కన్’గా పిలుచుకుంటారు. సిమ్రాన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

News December 26, 2024

తుది శ్వాస వరకూ పోరాడతాం: ఖర్గే

image

గాంధీ-నెహ్రూల వారసత్వం తమకు ఉందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బెలగావి CWC సమావేశంలో మాట్లాడుతూ, ‘ఇక్కడి నుంచి మేం సంకల్పంతో తిరిగొస్తాం. ఐకమత్యంతో ప్రత్యర్థుల అబద్ధాల్ని తిప్పికొడతాం. ఎన్నికలు గెలిచే నైపుణ్యాన్ని పార్టీకి అందిస్తాం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేస్తాం. గాంధీ-నెహ్రూ సిద్ధాంతాల కోసం, అంబేడ్కర్ గౌరవం కోసం తుదిశ్వాస వరకూ పోరాడుతాం’ అని తెలిపారు.