News October 20, 2024
వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు

AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్నట్లు ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో 6 టికెట్లను రూ.65వేలకు అమ్ముకున్నట్లు బెంగళూరుకు చెందిన సాయికుమార్ ఆరోపించారు. అయితే తాను టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలే కుట్ర చేశారని జకియా ఖానమ్ విమర్శించారు. మైనార్టీ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదన్నారు.
Similar News
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది NOV 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.
News December 5, 2025
‘ప్లేస్ నువ్వు చెప్తావా?’.. అచ్చెన్నకు YCP సవాల్

AP: మంత్రి అచ్చెన్నాయుడుకి YCP సవాలు విసిరింది. ‘Xలో ఇలా రంకెలు వేయడమెందుకు అచ్చెన్నాయుడు ప్లేస్ నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? టైం నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? నీతో చర్చకు మా పార్టీ నేతలు రెడీ. ఇంతకీ నువ్వు సిద్ధమా? ఈ సారైనా వస్తావా? పారిపోతావా?’ అంటూ ట్వీట్ చేసింది. ‘జగన్ 5 ఏళ్ల మోసపు పాలన vs కూటమి 18 నెలల అభివృద్ధి పాలన’ అంటూ అచ్చెన్నాయుడు చేసిన ట్వీటుపై ఇలా స్పందించింది.
News December 4, 2025
సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.


