News March 17, 2025

11 మంది సెలబ్రిటీలపై కేసులు

image

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.

Similar News

News March 17, 2025

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు అనుమతి

image

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌ను కోరగా తాజాగా అనుమతి లభించింది.

News March 17, 2025

రన్యారావు కేసులో మరో ట్విస్ట్

image

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన నటి రన్యా రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు గతేడాది నవంబర్‌లో పెళ్లి కాగా, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.

News March 17, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

image

TG: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!