News November 13, 2024
అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే: హైకోర్టు
AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది.
Similar News
News December 26, 2024
సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్
TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.
News December 26, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
News December 26, 2024
పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు
తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.