News March 25, 2025
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నందుకే నాపై కేసులు: కాకాణి

AP: కూటమి ప్రభుత్వం తనపై కావాలనే అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. ‘గతంలో అక్రమాలు జరగలేదని మైనింగ్ అధికారి రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్రమ మైనింగ్ అంటూ కేసు పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే నాపై కేసులు పెడుతున్నారు. వాటికి భయపడేది లేదు. అక్రమ కేసులపై కోర్టులను ఆశ్రయిస్తా. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి’ అని ఆయన అన్నారు.
Similar News
News March 28, 2025
తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే?

ఇటీవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ <<15869889>>తమీమ్ ఇక్బాల్<<>> కోలుకున్నారు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‘తమీమ్ సాధారణ స్థితికి రావడానికి జీవనశైలిని మార్చుకోవాలి. కఠినమైన డైట్ను అనుసరించాలి’ అని డాక్టర్ షాబుద్దీన్ తెలిపారు. అతను గ్రౌండులో దిగడానికి 3 నెలల టైమ్ పడుతుందని హెల్త్ మినిస్టర్ అబు జాఫర్ తాజాగా వెల్లడించారు. స్మోకింగ్ను మానుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
News March 28, 2025
వారికి ఉగాది, రంజాన్ సెలవులు లేవు

AP: ఈ నెల 30, 31న పబ్లిక్ హాలిడేల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 30, 31ని రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటించింది. ఆ రెండు రోజులు ఆఫీసులు ఉ.11 నుంచి సా.5.30 గంటల వరకు పని చేస్తాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులిచ్చింది.
News March 28, 2025
45 రోజులు, 4 కేసులు.. సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు: వైసీపీ

AP: కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును టీడీపీ లాయర్లకు దోచిపెడుతోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు మిత్రుడు సిద్ధార్థ్ లూథ్రాకు ఫీజు రూపంలో రూ.2.86 కోట్లను చెల్లించిందని మండిపడ్డారు. ఇది కేవలం 2024 జులై 16 నుంచి అక్టోబర్ 1 మధ్య 45 రోజుల్లో 4 కేసులకు చెల్లించిన మొత్తమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.