News September 2, 2024
CBI అధికారులపైనే కేసులు పెండింగ్‌లో ఉన్నాయ్

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులపై శాఖాపరమైన చర్యలకు సంబంధించి 82 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక వెల్లడించింది. ఈ కేసులు CBI ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, దర్యాప్తు సంస్థపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లేలా చేస్తున్నాయని పేర్కొంది. Dec 31, 2023 నాటికి, CBIలోని గ్రూప్-A అధికారులపై 54, గ్రూప్-B, C అధికారులపై 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
Similar News
News October 26, 2025
తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతమో తెలుసా?

AP: ఇవాళ 8-9AM మధ్య పార్వతీపురం జిల్లాలో గరిష్ఠంగా 34.7, NTR జిల్లాలో 34.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మరో 2-3 డిగ్రీల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ఏపీకి 800 KM దూరంలో ఉండటంతో ఆ ప్రభావం ఇప్పుడే కనిపించదని, 300 KMల దగ్గరకు చేరగానే వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే భూమి వేడెక్కి తుఫాన్ ప్రభావం అధికమవుతుందని చెప్పారు.
News October 26, 2025
డాక్టర్ ఆత్మహత్య కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మహారాష్ట్రలోని సతారాలో SI తనను రేప్ చేశాడంటూ <<18091644>>డాక్టర్ ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ గోపాల్ బదానే అరెస్టయ్యారు. ఫల్టాన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోపాల్ లొంగిపోయారని ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. అతడిని సతారా జిల్లా కోర్టులో హాజరుపరచగా 4 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. కాగా అంతకుముందు మరో నిందితుడు ప్రశాంత్ బంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News October 26, 2025
బ్రూక్ విధ్వంసం..

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ వన్ మ్యాన్ షో చూపించారు. ఇంగ్లండ్ 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్ అద్భుతమైన షాట్లతో 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో బ్రూక్ (135), ఓవర్టన్ (46) మాత్రమే రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం.


