News July 8, 2025

జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

image

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.

Similar News

News January 26, 2026

కార్లపై భారీగా టారిఫ్‌లను తగ్గించనున్న భారత్

image

భారత్, EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో భాగంగా యూరోపియన్ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తొలుత 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై పన్ను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఈ టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.

News January 26, 2026

భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: జిన్‌పింగ్

image

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-చైనా మంచి స్నేహితులు, భాగస్వాములు అని పేర్కొన్నారు. కాగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత 4 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన BRICS సదస్సుతో పాటు పలు ద్వైపాక్షిక సమావేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి.

News January 26, 2026

ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

image

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT